కర్ణాటకలోని మైసూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్తతో పాటు అత్తమామలు కట్నం కోసం వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మచ్చూరుకి చెందిన ఆనంద్, జ్యోతి (22) నాలుగేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
భర్త, అత్తమామలు కట్నం తీసుకురావాలని జ్యోతిని వేధించేవారు. దీంతో జ్యోతి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.