శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంకలో ఆగష్టు 26 నుంచి జరగాల్సిన ఆసియా కప్ ను యూఏఈలో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ టోర్నీలో శ్రీలంక, భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ తో పాటు మరో క్వాలిఫయర్ జట్టు పోటీ పడనున్నాయి. శ్రీలంకలో ఆగస్టు 1న ప్రారంభం కావాల్సిన లంక ప్రిమియర్ లీగ్ ను ఇప్పటికే వాయిదా వేశారు.