చెన్నైలోని క్రోంపేట రాధానగర్కు చెందిన 19 ఏళ్ల కృష్ణ హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. తన ప్రియురాలైన 15 ఏళ్ల బాలిక పెళ్లికి ఒప్పుకుంటేనే కిందకి దిగుతానని బెదిరించాడు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని, బాలికతో పెళ్లి చేసుకుంటానని హామీ ఇప్పించటంతో కిందికి దిగొచ్చాడు. అనంతరం పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. యువకుడు చేసిన పనితో సబర్బన్ రైళ్ల సర్వీసులకు అంతరాయం కలిగింది.