ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం ద్వారా పశువుల పేడను కొనుగోలు చేస్తుంది. తాజాగా గోమూత్రాన్ని కూడా కొననున్నట్టు ప్రకటించింది. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మరో వారం రోజుల్లో ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుందని వెల్లడించింది. పేడను రూ.2 చొప్పున కొనుగోలు చేస్తుండగా.. గోమూత్రానికి లీటరు ధర రూ.4 గా నిర్ణయించింది.