మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 51 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సు ఖాల్ ఘాట్ వద్ద అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది యాత్రికులు మృతిచెందారు. రెస్క్యూ టీం 15 మందిని రక్షించింది. మరో 24 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. బస్సు ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa