జార్ఖండ్ లోని జోర్భితా గ్రామంలో దారుణం జరిగింది. పుష్పా హెంబ్రోమ్ అనే మహిళ తన భర్తను కత్తితో పొడిచి చంపింది. పుష్ప శనివారం రాత్రి జీన్స్ ప్యాంటు ధరించి జాతరకు వెళ్లి వచ్చింది. జీన్స్ ఎందుకు ధరించావని భర్త ఆమెను ప్రశ్నించాడు. దీంతో గొడవ జరిగింది. పుష్ప ఆవేశంలో తన భర్తను కత్తితో పొడిచింది. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.