అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవితో పాటు, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడి పదవికి నరీందర్ బాత్రా సోమవారం రాజీనామా చేశారు. కొత్త ఆలోచనలతో వచ్చేవారికి సమయం ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఇదిలా రూ.35 లక్షల హాకీ ఇండియా నిధుల దుర్వినియోగంపై బాత్రాపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఇది కూడా రాజీనామాకు కారణం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.