మహిళా పోలీసుల ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తయి, సర్వీస్ రెగ్యులరైజ్ అయిన సందర్భంగా ఈ రోజు కాకినాడ జిల్లాలోని మహిళా పోలీసులు. జిల్లా పోలీసు కార్యాలయం లో SP M.రవీంద్రనాథ్ బాబు, IPS ని మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా SP మాట్లాడుతూ...... గత 2 సంవత్సరాల కాలంలో మహిళా పోలీసులు పోలీసు శాఖతో కలిసి పని చేసి ఉత్తమ ఫలితాలు, నాణ్యమైన పనితీరు కనబరచారని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మహిళా పోలీసులందరూ మరింత బాధ్యతతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని, ఉద్యోగ నిర్వహణలో ఏ విధమైన ఇబ్బందులున్నా తనకు నేరుగా తెలియజేయాలని సూచిస్తూ, మహిళా పోలీసులకు అభినందనలు తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa