రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొని ఎన్డీయే అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ముకి అనుకూలంగా వైయస్ఆర్ సీపీ ఎంపీలు ఓటు వేశారు. ఈ ఎన్నిక ద్వారా తొలిసారిగా ఒక ఆదివాసీ గిరిజన మహిళ భారతదేశ 15వ రాష్ట్రపతి కాబోతున్నారని వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఓటింగ్‌లో వైయస్ఆర్ సీపీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులంతా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa