బీహార్లోని బెగుసరాయ్ జిల్లా మోహన్పూర్ గ్రామంలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. రూ.12 వేలు దొంగతనం చేశాడనే నెపంతో పంచాయతీ పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నేలపై ఉమ్మి వేసి, దానిని బాధితుడితో నాకించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో బక్రీ పోలీస్ స్టేషన్ అధికారి హిమాన్షు కుమార్ సింగ్ స్పందించారు. దీనిపై ఫిర్యాదు అందలేదని, అయినప్పటికీ నిందితులపై చట్టపరమైన చర్యలుంటాయని అన్నారు.