అత్తను గొడ్డలిని నరికి చంపిన దారుణ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తపాలెం గ్రామానికి చెందిన నల్లబోతుల బ్రహ్మంకు గుదె కస్తూరమ్మ కుమార్తె కామేశ్వరితో 30 ఏళ్ల క్రితం పెళ్లైంది. అప్పటి నుంచి అల్లుడు, కుమార్తె కస్తూరమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. 4 రోజుల క్రితం కామేశ్వరి హైదరాబాద్ వెళ్లింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ బ్రహ్మం గొడ్డలితో కస్తూరమ్మను నరికి చంపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa