రాజ్యాంగం పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించిందని, కానీ ప్రధానమంత్రిని, మంత్రులను దూషించడం భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ కు చెందిన ముంతాజ్ మన్సూరి ప్రధానితో పాటు కేంద్ర హోం శాఖ మంత్రిపై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై మన్సూరి కోర్టును ఆశ్రయించగా, అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది.