గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్‌ను సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుల జాబితా నుంచి తొలగిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో గోవా కాంగ్రెస్ పార్టీలో చీలికకు కామత్ ప్రయతించినందుకు గానూ పార్టీ అధిష్టానం కొరడా ఝళిపించింది. ఇటీవల గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు బిజేపితో చేతులు కలిపిన పార్టీ తీవ్రంగా పరిగణించింది.