వాయువ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి దారుణం జరిగింది. రాంలీలా మైదానం సమీపంలో అభిషేక్ సింగ్ (23) అనే యువకుడు తుపాకీతో కాల్చి చంపబడ్డాడు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మృతుడి స్నేహితులలో ఒకరే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.