చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పిన గురువులను, బాల్యమిత్రులను కలిసే అవకాశం కలిగిన ఈదినం నాకు ప్రత్యేకమైనది అని టీడీపీ నాయకులూ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఆయన 10వ తరగతి మిత్రులందరితో కలిసిన శుభ సమయంలో మాట్లాడుతూ... , వందమందికి పైగా చిన్ననాటి మిత్రులందరం 42 ఏళ్ళ తరువాత ఒకచోట అదీ మేము చదువుకున్న అనంతపురం పొట్టి శ్రీరాములు పాఠశాలలో కలుసుకున్నాం. అలనాటి ముచ్చట్లతో సరదాగా గడిపాము. సుమారు 15మంది బాల్యమిత్రులం తరచూ కలుసుకుంటుంటాం. వందమంది ఒకచోట కలిసి జ్ఞాపకాలను కలబోసుకోవడం చాలా అరుదు అని ఆనందాన్ని వ్యక్త పరిచారు.