రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రాంగణం ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసన సభాపతి తమ్మినేని సీతారాం,. భారత రాష్ట్రపతి ఎంపికకు సంబందించిన ఎన్నికలు ప్రక్రియ దేశవ్యాప్తంగా సోమవారం ప్రారంభం అయ్యింది. సోమవారం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికలు అసెంబ్లీ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి.
ఓటు హక్కు కలిగి ఉన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలుత ఓటు హక్కును వినియోగించుకోవడం తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అనంతరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు తమ సంబంధిత అసెంబ్లీ ప్రాంగణంలో ఓటింగ్ లో పాల్గొంటున్నారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ జరగింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ అవకాశం లేని విషయం విధితమే.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరుగుతుంది. ఏపీ లో 175 మంది ఎమ్మెల్యేలు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వీలుండగా, ఇప్పటికే మూడు వంతులు పైగా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. తాము బలపరిచిన అభ్యర్థి గెలుపు కు వైసీపీ ఎమ్మెల్యే లు అందరూ ఒకే మాట, ఒకే బాట పై సీఎం వెంట ఉన్నారు.
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు కలిసి ఎలక్టోరల్ కాలేజీగా రాష్ట్రపతిని ఎన్నుకునే ఆనవాయితీ కొనసాగుతుంది. లోక్ సభలోని 543 మంది సభ్యులు. 233 మంది రాజ్యసభ సభ్యులు కలిపి 776 మంది ఓటింగ్ హక్కు కలిగి ఉన్నారు. అదే విధంగా 4, 120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోని సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జారీ చేసిన ఎన్నిక షెడ్యూల్ ప్రకారం నేడు భారత 16 వ రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి.
బీజేపీ బలపరిచిన ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారికంగా ఉన్న వై సి పి మద్దతు తెలిపింది. ఈ నెల 21న కౌంటింగ్ జరగనుంది. 24వ తేదీ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 25వ తేదీతో ముగియనుండటం తో రాష్ట్రపతి ఎన్నికలు అనివార్యం అయ్యింది. నూతనంగా ఎన్నికయ్యే రాష్ట్రపతి ఈ నెల 25 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.