బరువులెత్తడం వల్ల మహిళలకు చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వెయిట్‌లిఫ్టింగ్ తో శారీరక దృఢత్వం పెరుగుతుంది. తొందరగా అలసట రాదు. ముందుకు వంగడం, మోచేతులపై వాలడం, వస్తువుల్ని లాగడం, నెట్టడం వాటి పనులు సులభంగా చేసుకోగలుగుతారు. శరీరంలో కొవ్వు కరుగుతుంది. ఎముకల బలాన్ని పెంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండార్ఫిన్లను విడుదల చేసి రోజంతా చురుగ్గా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.