పాకిస్థాన్ పంజాబ్-సింధ్ సరిహద్దులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింధు నదిలో పెళ్లి వేడుకకు 100 మందితో వెళ్లిన పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది మహిళలు చనిపోయారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఓవర్‌లోడ్, అధిక నీటి ప్రవాహం కారణంగా పడవ బోల్తా పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa