ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పదేళ్లలో తొమ్మిది పార్టీలతో కలిశాడని, రాజకీయాలకు ఆయన ఏమాత్రం పనికిరాడని మండిపడ్డారు. పవన్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.