జర్మనీలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వంట నూనె దొరకటం కష్టంగా మారింది. దీంతో అక్కడి బ్రూపబ్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇచ్చి బదులుగా లీటర్ బీర్‌ను తీసుకోవచ్చని ప్రకటించారు. ఈ ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 400 లీటర్ల వంటనూనెను ఈ ఆఫర్ కింద మార్చుకున్నారని, మెస్‌లో కుకింగ్ ఆయిల్ నిల్వలేదని అందుకే ఈ ఆఫర్ చేశామని పబ్ మేనేజర్ తెలిపారు.