శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతుంది. ఇన్ ఫ్లో 3,31,559 క్యూసెక్కుల నీరు డ్యామ్‌కు చేరుతోంది.. ఔట్ ఫ్లో 35,554 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 872.50 అడుగులకు చేరుకుంది. తెలంగాణ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.