బాబును వీలైనంత త్వరగా సీఎంను చేయాలనే తాపత్రయం తప్ప, పవన్ కు వేరే ఉద్దేశం కనిపించడం లేదు. గతంలో చంద్రబాబుతో కలిసి ఉన్నప్పుడు, ఇదే మాదిరిగా రోడ్ల మీద హ్యాట్సాగ్ చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? నాడు బాబు రోడ్ల నిధులను దారి మళ్లించినా పవన్ అడగలేదేందుకు? చంద్రబాబు రోడ్లు పట్టించుకోకపోయినా పవన్ నాడు ఏం మాట్లాడలేదు. ప్రతి రోడ్డుకు ఒక జీవితకాలం 8 ఏళ్లు లేదా 10 ఏళ్లు ఉంటుంది. మేము వచ్చి కేవలం 3 ఏళ్లు మాత్రమే అయింది. ఆరోజు రోడ్లు బాగు చేసి ఉంటే ఇవాళ ఆ పరిస్థితి ఉండేది కాదు కదా అని వైసీపీ నాయకులూ , మంత్రి దాడిశెట్టి రాజా తెలియజేసారు.