వరద ప్రభావిత గ్రామాలైన ఐ. పోలవరం మండలం ఎదుర్లంక, ముమ్మిడివరం మండలం కమిని గ్రామాల్లో టిడిపి పొలిట్ భ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పర్యటించి ముంపు బాదితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎదుర్లంక గ్రామంలో ముంపుకు గురైన 80 కుటుంబాలకు టిడిపి నాయకులు దాట్ల సుబ్బరాజు సమకూర్చిన బియ్యం, నిత్యావసర సరుకులు, పాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎం. ఎల్. ఎ. దాట్ల బుచ్చిబాబు, వనమాడి కొండబాబు, చెల్లి వివేకానంద, అమలాపురం పార్లమెంట్ పార్టీ ఇన్ చార్జి గంటి హరీష్ మాదుర్, మాజీ శాశనమండలి చైర్మెన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు చెల్లి అశోక్, టిడిపి రాష్ట్ర నాయకులు గుత్తుల సాయి, మాజి నీటి సంఘం అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు, అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.