పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో 569 కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు కోటి డెబ్బైలక్షల(1,74,83,831) రూపాయల విలువైన 1,23,984 మద్యం బాటిళ్లు ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది. ది:18.07.2022 న (16.05.2020 నుండి 18.07.2022 వరకు) పలు కేసుల్లో సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని స్థానిక దాచేపల్లి మార్కెట్ యార్డ్ మైదానంలో రోడ్డు రోలర్ సహాయంతో ద్వంసం చేయడం జరిగినది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y.S.జగన్మోహన్ రెడ్డి గారు మరియు గౌరవ డీజీపి శ్రీ K.V. రాజేంద్ర నాథ్ రెడ్డి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మరియు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి,పోలీస్ అధికారులు మరియు సిబ్బంది నిర్విరామంగా కృషి చేసి అక్రమ మద్యం రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేసి,మద్యం బాటిళ్లు సీజ్ చేసి,మద్యం అక్రమ రవాణా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.