జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ. పోలవరం, తాళ్లరేవు మండలాల్లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ముంపు గ్రామాలలోని ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని, పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి నీరు, భోజనం అందించి వైద సహాయం అందించాలన్నారు. ముంపుకు గురైన లంక గ్రామాలలో పశువులకు పశుగ్రాసం అందించాలని, నీటిమునిగి గృహలకు రూ. 25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. వరద బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపడతామని బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన వెంట జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదాసి పుండరీస్ తదితరులు పాల్గొన్నారు.