అనంతపురం పోలీస్ వారు ఒక విన్నూతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అదే సెల్ ఫోన్ పోగొట్టుకుంటే దానిని వెంటనే ఛేదించడం. ఈ క్రమంలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు 105 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు అందజేశారు. ఇప్పటి వరకు 1418 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటిలో ఇప్పటి వరకు 1292 సంబంధిత బాధిత ప్రజలకు అందజేశారు. పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/ మిస్ అయిన సెల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే అందుతుండటంతో బాధిత ప్రజల నుండీ హర్షం వ్యక్తమవుతోంది.