తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే బస్సు చార్జీ రూ.760. తిరుగు ప్రయాణంలో కర్ణాటక ప్రభుత్వం రూ.540 మాత్రమే తీసుకుంటుంది. అంటే జగన్ రెడ్డి వీరబాదుడు రూ.220లు. ఈ రేంజ్ లో బాదుతున్నా రోడ్లు చూస్తే అద్వాన్నమే అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. మరి కనికరం లేకుండా బాదేస్తున్న డబ్బును జగన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అని ప్రశ్నింస్తున్నారు. ఐతే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన జనసేన, టీడీపీ , బీజేపీ లు రోడ్లు బాగుచెయ్యండి అని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జనసేన ఐతే ఒక అడుగు ముందుకు వేసి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది.