ప్రతి సోమవారం రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "స్పందన" కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్య పరిష్కారం పట్ల భరోసా కల్పించిన జిల్లా ఎస్పీ శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS. సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి నిర్దిష్ట సమయంలోపు పరిష్కారం చూపాలని జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసారు. ప్రజల సమస్యలు త్వరగతిన తీర్చుకోవడానికి ఇది సరైన వేదిక కాబట్టి ప్రజలందరూ దీనిని ఉపయోగించుకోవాలి అని తెలియజేసారు.