కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని సమర్థించానన్న పవన్.. నిజానికి ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించగానే ఈ జిల్లాకు మాత్రమే అంబేడ్కర్ పేరు పెట్టాలా? అంబేడ్కర్‌ను కేవలం ఒక జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తారా అన్నాడు. అవన్నీ మర్చిపోయి, ఆ నిర్ణయాన్ని తొలుత స్వాగతించింది నేనే అని మళ్ళీ పవన్ అంటాడు. ఎప్పుడు, ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. జగన్ గారి పాలనలో పేదలకు, ప్రజలకు డీబీటీ విధానంలో రూ.1.65 లక్షల కోట్లు జమ కావడాన్ని పవన్ ఓర్చుకోలేక పోతున్నాడు అని వైసీపీ నాయకులూ దాడిశెట్టి రాజా తెలియజేసారు.