ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. 12 ఏళ్ల మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు కామాంధులు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పదేళ్ల మైనర్‌పై ఇంటి యజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.త్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. షారుక్, ఒవైసీలను నిందితులుగా పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే: బరేలీ.. బిథరి చైన్పూర్లో ఏడో తరగతి విద్యార్థికి పాఠశాల సమీపంలోని ఓ దుకాణంలో మత్తు మందు కలిపిన శీతల పానీయాలు ఇచ్చి నిందితులు కిడ్నాప్ చేశారు. అనంతరం దారుణానికి ఒడిగట్టారు. షహదానా క్రాసింగ్ రోడ్డు వద్ద శనివారం ఉదయం వదిలేశారు. బాధితురాలు ఇంటికి చేరుకుని జరిగిన విషయమంతా తల్లిదండ్రులకు తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. హిందూ జాగరణ్ మంచ్, గోరక్షా దళ్ నిరసనలు తెలపడం వల్ల నిందితులు ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు.
ఎవరూ లేని సమయంలో: పదేళ్ల మైనర్‌పై 37 ఏళ్ల ఇంటి యజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన దిల్లీలోని అలీపుర్లో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో నిందితుడు ఆమెను లైంగికంగా వేధించేవాడు. నిందితుడ్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గుడ్ అండ్ బ్యాడ్ టచ్‌పై స్కూల్లో ఓ మహిళా పోలీస్ అవగాహన కల్పిస్తున్న సమయంలో.. బాధితురాలు ఈ విషయం చెప్పింది.సామూహిక అత్యాచారం: 17 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. గోండా జిల్లాలోని ఖోదరా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఇద్దరు నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అల్లారఖా, సల్మాన్‌ను నిందితులుగా గుర్తించారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మత్తు మందు ఇచ్చి హోటల్లో: 17 ఏళ్ల మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సబ్ ఇన్స్పెక్టర్. ఈ ఘటన మహారాష్ట్ర.. అమరావతి జిల్లాలో జరిగింది. బాధితురాలికి మత్తుమందు ఇచ్చి హోటల్ గదిలో అఘాయిత్యం చేసినట్లు పోలీసులు తెలిపారు. జులై 13న ఈ ఘటన జరగ్గా.. నిందితుడ్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.