ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే.. గుడ్ మార్నింగ్ సీఎం సర్. రోడ్లన్నీ హ్యాట్సాగ్ చేస్తాను అని రాష్ట్ర రహదారులు–భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అభివర్ణించారు. ఆయన సీఎంగారిపై వ్యాఖ్యలు చేస్తే మేము కూడా ఆయనపై కామెంట్స్ చేయగలం. గుడ్ మార్నింగ్ జనసేన పార్టీ. గుడ్ ఆఫ్టర్నూన్ టీడీపీ. గుడ్ ఈవినింగ్ బీజేపీ. అని మేము కూడా మాట్లాడగలం.జనసేన పార్టీ ఒక జోకర్ల సేన పార్టీగా ఉంది. అంతే తప్ప ఆ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ, రూపుకానీ లేవు. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి భారీ వరదలు వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలు అతలాకుతలం అవుతుంటే, పవన్ వచ్చి రాజకీయం చేస్తున్నాడు. అధికార యంత్రాంగం, పోలీసులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఫ్లడ్ మానిటరింగ్, సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే, పవన్కళ్యాణ్ అక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు అని మండి పడ్డారు.