బీహార్లోని సీతామర్హి జిల్లాలో ముహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ వీడియోను చూసినందుకు ఒక యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా కత్తితో పొడిచారు. గాయాలతో యువకుడు చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే జూలై 16న జరిగిన ఈ దాడికి వ్యక్తిగత శత్రుత్వమే కారణమని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినా కానీ అందులో నూపుర్ శర్మ ప్రస్తావన లేదు.