పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై అలవల గ్రామంలో మంగళవారం ఉదయం హత్యాయత్నం జరిగిన సంగతి విధితమే. తాజాగా దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన బాలకోటిరెడ్డిపై వైసీపీ నేతలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చావుబతుకుల మధ్య ఉన్న బాలకోటిరెడ్డికి ఏం జరిగినా సిఎం జగన్ బాధ్యత వహించాలన్నారు.