విజయనగరం జిల్లా, వార్షిక తనిఖీల్లో భాగంగా Mrs. M. దీపికా , IPS, జూలై 19న డెంకాడ పీఎస్ ను సందర్శించి, రికార్డులు, సిడి ఫైల్స్, స్టేషను ప్రాంగణంను పరిశీలించారు. అనంతరం, స్టేషను సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా పెట్టాలని, కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు. విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ శ్రీ టి త్రినాథ్, భోగాపురం సిఐ శ్రీ విజయనాధ్, ఎస్ఐ శ్రీమతి పద్మావతి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.