అమరావతి సెక్రటేరియట్ కార్యాలయం నుండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వై . ఎస్ . జగన్ మోహన్ రెడ్డిగారు నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని నేరుగా వారి ఖాతాల్లోకి నగదును జమ చేశారు. కలెక్టరేట్ సమావేశపు హాల్ నుండి కృష్ణా జిల్లా, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాలగారు , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికగారు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు గారు తదితరులు ఈ వీడియోకాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు. ఈ .బీ.సీ. నేస్తం, వై . ఎస్ . ఆర్ . జగనన్న చేదోడు, వై. ఎస్. ఆర్. కాపునేస్తం చెక్కులు మరియు కొత్తగా మంజూరైన పెన్షన్లు , రైస్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.