ముఖాన్ని కాంతివంతంగా ఉంచుకోవడం కోసం మనలో చాలామంది చాలారకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే, చిన్న చిట్కాలను ఉపయోగించి ముఖాన్ని, అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే...
--- పాల మీగడలో తేనెను వేసి బాగా రంగరించి ముఖానికి రాసుకుని, 30 నిమిషాల తరువాత కడిగేయడం వల్ల ముఖ ఛాయ కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
--- పసుపును, గంధాన్ని సమపాళ్లలో తీసుకుని, కొద్దిగా పాలమీగడ జోడించి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని ఆరిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి.