కావలసిన పదార్థాలు: వాము - రెండు స్పూన్లు , ఉల్లిపాయలు - 3, పచ్చిమిర్చి - 3, బెల్లం - కొద్దిగా, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు - సరిపడా, చింతపండు - యాభై గ్రా, వెల్లుల్లి - 3 పాయలు, కరివేపాకు - 1 రెబ్బ, కారం - 1 స్పూన్.
తయారీ విధానం:
--- ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని బారుగా కోసుకోవాలి. చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకోవాలి.
--- స్టవ్ ఆన్ చేసి, నూనె వేసి, బాగా కాగాక, అందులో తాలింపు దినుసులు వేసి బాగా వేయించుకోవాలి.
--- అందులోనే కరివేపాకు, చితక్కొట్టిన వెల్లుల్లి వేసి బాగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేపుకోవాలి.
--- అవి వేగుతుండగా, వామును కచ్చాపచ్చాగా మిక్సీ లో కానీ, రోట్లో కానీ దంచుకోవాలి.
--- వేగుతున్న ఉల్లిపాయల్లో ఈ వాము ముద్దను వేసి పచ్చివాసన పోయేంతవరకు బాగా వేపుకోవాలి.
--- ఆపై పసుపు, ఉప్పు, కారం మీరుచికి తగ్గట్టు వేసుకుని, బాగా కలపాలి.
--- ఇప్పుడు అందులో చింతపండు రసాన్ని వేసి, ఒక పదినిమిషాల పాటు మరగబెట్టాలి.
--- ఆ తర్వాత అందులో నిమ్మకాయంత బెల్లం తరుగును వేసి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.... వాము పులుసు రెడీ...
--- వర్షాకాలంలో వాము పులుసు తినడం వల్ల దగ్గు, ఆయాసం తగ్గుతుంది. అజీర్ణ సమస్యలు ఉండవు. గొంతునొప్పికి చెక్ చెప్తుంది.