ఏపీలో వ్యవసాయ బోర్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు పెడుతోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో శరవేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
విద్యుత్ మీటర్లకు కొందరు అంగీకారం తెలుపుతున్నా, కొందరు రైతులు వీటిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు భారం అవుతోందని, మీటర్ల ద్వారా అధిక ఫీజులు వసూలు చేస్తే తాము ఇబ్బంది పడతామని వాపోతున్నారు.