బ్రిటన్‌లో రికార్డు స్థాయిలో 39.1డిగ్రీల సెల్సియస్ (102.4 ఫారన్‌హీట్) ఉష్ణోగ్రతలు మంగళవారం నమోదయ్యాయి. అక్కడ ఇప్పటివరకూ నమోదైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలలో ఇవే అధికమని బ్రిటన్ వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశ చరిత్రలో తొలిసారిగా 40డిగ్రీల సెల్సియస్ మార్కును దాటే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.