కర్నాటకలోని తుమకూరుకు చెందిన పల్లవి, అర్జున్ దంపతుల చిలుక ఎటో వెళ్లిపోయింది. దానిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించామని, అది లేకపోవడంతో వెలితిగా ఉందని బాధపడుతున్నారు.
ఆ చిలుక ఆచూకీ చెబితే రూ.50 వేలు నజరానా అందించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్లను తుమకూరు ప్రాంతంలో అతికించారు. వీటిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.