ఒంటిమిట్ట మండల పరిధిలోని అరుదైన అడవి ప్రాణి అలుగు మృతి చెందింది. ఈ మేరకు ఆ ప్రాంత ఫారెస్ట్ సెక్షన్ అధికారి బ్రహ్మయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారి స్వాతి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు.
అలుగుకు ఎనిమిది నెలల వయసు ఉంటుందని, భయపడి పరుగు తీయడంతో ఊపిరి ఆగినట్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని ఆయన అన్నారు.