అల్లూరి జిల్లా చింతూరు మండలం ఎర్రంపేటలో విషాదం జరిగింది. చెరువులో స్నానానికి దిగి ఇద్దరు బాలికలు మృతి చెందారు. మృతులు అస్మిత (8), దుర్గాభవాని (10)గా గుర్తించారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa