ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనింగ్ మాఫియా అరాచకం..ఏకంగా డీఎస్పీపైనే ట్రిప్పర్ నడిపారు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 01:43 AM

హర్యానాలోని మైనింగ్ మాఫియా ధారుణమైన కిరాతకానికి పాల్పడింది. తమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వచ్చిన డీఎస్పీని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్... నూహ్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే పక్కా సమాచారంతో రైడింగ్ కు వెళ్లారు. అక్రమంగా రాళ్లను తరలిస్తున్న వాహనానికి ఆయన అడ్డుగా నిలబడ్డారు. వాహనాన్ని ఆపాలని సైగ చేశారు. అయితే, వాహన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నేరుగా ఆయన పైకి ఎక్కించాడు. దీంతో డీఎస్పీ అక్కడికక్కడే మృతి చెందాడు. 


మరోవైపు వెంట్రుకవాసిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలతో బయటపడ్డారు. వాహనం దూసుకొస్తున్న సమయంలో వారిద్దరూ దారి పక్కకు జంప్ చేసి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై హర్యానా పోలీసు శాఖ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని చట్టం ముందు నిలబెడతామని ట్వీట్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com