ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పన్నీర్ సెల్వం స్థానంలో...ఆర్.బీ. ఉదయ్ కుమార్

national |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 01:46 AM

అన్నా డిఎంకేలో ఇక పన్నీర్ సెల్వం ఎపిసోడ్ క్లోజ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. పన్నీర్ బహిష్కరణతో ఖాళీ అయిన స్థానాన్ని (అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్) అన్నాడీఎంకే భర్తీ చేసింది. పన్నీర్ స్థానంలో మాజీ మంత్రి ఆర్.బీ.ఉదయ్ కుమార్ ను నియమించింది. ఈ సందర్భంగా పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మాట్లాడుతూ... ఉదయ్ కుమార్ ను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెప్పారు. ఈ నెల 17న జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఉదయ్ కుమార్ ను ఎన్నుకున్నామని తెలిపారు. మరోవైపు లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ సెక్రటరీగా ఎస్ఎస్ కృష్ణమూర్తిని ఎన్నుకున్నట్టు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com