నేడు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. సీఎం బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు రామాయపట్నం చేరుకుంటారు. 11.00 నుంచి 12.30 గంటల వరకు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడి నుంచి తిరిగి బయలుదేరి 2 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసారు. 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడిషనల్ యస్.పి. స్థాయి అధికారి ఇంచార్జిగా, ప్రతి గ్యాలరీ వద్ద సీఐ పర్యవేక్షణలో బృందం ఏర్పాటు చేసారు.