అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడిన నైపద్యంలో జిల్లాకు హెడ్ క్వార్టర్స్ అయిన అనకాపల్లిలో గల రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా తీర్చిదిద్దాలని పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ గారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ఉదయం కలిశారు పార్లమెంటులో ఆయన కార్యాలయంలో కలిసి అనకాపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ గా మారడంతో పాటు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య కు తగినట్లు అభివృద్ధిని చేయాలని కోరారు. ప్రయాణికులకు నీడనిచ్చే షెడ్స్ ఏర్పాటు చేయాలని, మొదటి తరగతి , సాధారణ తరగతి ప్రయాణికులు వేచి ఉండేందుకు ప్రత్యేక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని, ప్లాట్ ఫారం లపై ట్రైన్ కోచ్ ల డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రయాణికులు రద్దీ దృష్టిలో పెట్టుకుని రిఫ్రెష్మెంట్ గదులు , మరుగుదొడ్లు శుభ్రపరిచే ఎప్పటికప్పుడు శుభ్రంగా పరిచే విధంగా తగిన సిబ్బందిని పెంచాలని, ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలకు తగిన పార్కింగ్ విస్తీర్ణాన్ని పెంచాలని, స్టేషన్ ఆవరణ ప్రాంతంలో మొక్కలు ఎక్కువ నాటాలని, వృద్ధులు, దివ్యాంగులకు ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ ను ఆపరేటింగ్ చేసేందుకు తగిన సిబ్బందిని పెంచాలని, కొత్త జిల్లాగా ఏర్పడిన అనకాపల్లికి ప్రజా ప్రతినిధులు వ్యాపారవేత్తలు ప్రజలు అనకాపల్లి స్టేషన్ నుండి రకరకాల ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వుందన్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని ట్రైన్లు కోరమండల్ ఎక్స్ప్రెస్ 12842, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 12863, ముంబై ఎల్టిటి ఎక్స్ప్రెస్ 18519 అనకాపల్లి స్టేషన్ నందు నిలపాలని మరియు ట్రయల్ రన్ బేసిస్ పద్ధతిలో రత్నాచల్ ట్రైన్ ను యలమంచిలి స్ట్రేషన్ నందు నిలపాలని, అనకాపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ నందు టవర్ క్లాక్ ను ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై స్పందించిన గౌరవ రైల్వే మంత్రి గారు అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు త్వరలోనే చేపడతామని కేంద్ర రైల్వే మంత్రి హామీ ఇచ్చినట్లు ఆమె చెప్పారు.