రెండు తలలతో పుట్టిన పిల్లి కూన సాధారణంగా కొన్ని గంటల కంటే బతకవు. కానీ ఆదివారం థాయ్‌లాండ్‌లో పుట్టిన ఈ కూన మాత్రం భేషుగ్గా బతికేసింది. పైగా రెండు మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ యజమాని మురిసిపోతున్నాడు. దీనికి టుంగ్ గ్రెన్ (వెండి బ్యాగు), టుంగ్ టోంగ్ (బంగారు బ్యాగు) అని ఏకంగా రెండు పేర్లు కూడా పెట్టుకున్నాడు. రెండు తలల పిల్లుల్ని రెండు తలల రోమన్ దేవత జానస్ పేరిట జానస్ క్యాట్స్ అని పిలుస్తారు.