పోలవరం ప్రాజెక్టును ఇదిగో కడుతున్నాం.. అదిగో అయిపొవచ్చిందని నిన్నటి వరకు జగన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు మంత్రులు బల్లలు గుద్ది మరీ రెచ్చిపోయారు అని టీడీపీ నాయకులూ ఎద్దేవా చేసారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదని ఇటీవలే మంత్రి అంబటి తమ ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టారు. ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా జగన్ రెడ్డి అసమర్థతను దేశమంతా వినేలా కేంద్ర జల శక్తి శాఖ బయటపెట్టింది. పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంటోందని ఆరోపించింది. 2024 నాటికి పూర్తి కావచ్చని చెప్పింది.అంటే జగన్ రెడ్డి అధికారంలో ఉన్నంతవరకు పోలవరం పూర్తి కాదన్నమాట అని అభిప్రాయపడ్డారు.