ఐరోపాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 6 వారాల్లో కరోనా కేసులు మూడింతలు పెరగగా, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రెండు రెట్లు పెరిగింది. ఐరోపాలోని 53 దేశాల్లో గత వారం రోజుల్లో దాదాపు 30 లక్షల కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో మంగళవారం తెలిపింది. వారానికి 3 వేల మంది మరణిస్తున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నమోదవుతోన్న కేసుల్లో సగం ఐరోపా దేశాల్లోనే నమోదవుతున్నట్లు చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa