జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అలానే స్పష్టంగా చెప్పాలంటే ... మెగా బ్రదర్స్ ఐన , చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు పై సిపిఐ నాయకులూ నారాయణ అవహేళనగా మాట్లాడిన సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయం మీద మెగా బ్రదర్ నాగ బాబు స్పందిస్తూ... ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి ...! తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు అని జనసైనికులకి , మెగా ఫాన్స్ కి సలహా ఇవ్వడం జరిగింది.